Hyderabad: ఆ 19 కిలోమీటర్లే కీలకం..
ABN , Publish Date - Sep 06 , 2025 | 10:41 AM
మహా నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ గణేశ్ విగ్రహం మొదలుకొని హుస్సేన్‌సాగర్ వరకు గల ప్రధాన శోభాయాత్ర మార్గం (19 కిమీ)లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.
- శోభాయాత్ర మార్గంలో పటిష్ట బందో‘మస్త్’
- నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
- టస్కర్ డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- ఎక్కడికక్కడ నిఘా
హైదరాబాద్‌సిటీ: మహా నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ గణేశ్ విగ్రహం మొదలుకొని హుస్సేన్‌సాగర్ వరకు గల ప్రధాన శోభాయాత్ర మార్గం (19 కిమీ)లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ట్రాఫిక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం వేడుకలకు సుమారు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. 30 వేల సిబ్బందితో పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్‌ఏఎఫ్, పారా మిలటరీ బలగాలను అందుబాటులో ఉంచామన్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ (69 అడుగులు) శోభాయాత్ర సుమారు 2.5 కిలోమీటర్ల కొనసాగుతుందన్నారు. ఇందుకోసం రెండు షిఫ్టుల్లో 80 మంది సిబ్బంది పనిచేస్తారన్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు..
గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని కచ్చితంగా నగరవాసులు పోలీసులకు సహకరించాలన్నారు. సికింద్రాబాద్, నార్త్‌జోన్, ఈస్టుజోన్, సౌత్‌ఈస్టుజోన్, సౌత్ వెస్టు జోన్, వెస్టుజోన్ ఇలా అన్ని మార్గాల నుంచి ప్రఽధాన రహదారుల గుండా వచ్చే ట్రాఫిక్‌ను ఎక్కడిక్కడ మళ్లింపులు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులకు ప్రత్నామ్నాయ మార్గాలు సూచించామని, కొన్ని జంక్షన్‌లలో బస్సులకు అనుమతిలేదని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు సెప్టెంబరు 6 ఉదయం 6 గంటల నుంచి 7 ఉదయం 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో విహంగ పర్యవేక్షణ
శోభాయాత్ర పర్యవేక్షణకు అద్భుతమైన విజువలైజేషన్‌తో (హైక్వాలిటీ) కూడిన 9 డ్రోన్లు వినియోగిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పెద్ద పెద్ద భవనాలకు ఏర్పాటు చేసిన సుమారు 100 హైరైజ్ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామన్నారు. సీసీటీవీలు అవసరమైన ప్రాంతాలను గుర్తించి 250 కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. గణేష్ విగ్రహాలకు తొలిసారిగా క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. స్కాన్ చేస్తే ఆ విగ్రహం ఏ జోన్, ఏ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినది అనే విషయాలు తెలుస్తాయన్నారు.
పర్యావరణ అనుకూల విగ్రహాలకు ప్రత్యేకం
పర్యావరణానికి అనుకూలంగా ఉన్న విగ్రహాల నిమజ్జనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ సీపీ తెలిపారు. సంజీవయ్య పార్కు, జలవిహార్, ఎన్టీఆర్ స్టేడియం, ఐమాక్స్ థియేటర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, చిలకలగూడ, అమీర్‌పేట, సైదాబాద్, చింతల్‌బస్తీ, గుడిమల్కాపూర్, అంబర్‌పేట ప్రాంతాల్లో బేబీ పాండ్స్, పోర్టబుల్ రబ్బర్ ట్యాంకులు, తవ్వకం ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రిచ్‌మౌండ్ విల్లా లడ్డూ రూ. 2.3 కోట్లు
నార్సింగ్: గండిపేట మండలం బండ్లగూడలోని రిచ్‌మౌండ్ విల్లా టౌన్‌షి్‌పలో వినాయకుడి లడ్డూ శుక్రవారం రాత్రి రూ. 2.3 కోట్లు పలికింది. శుక్రవారం రాత్రి టౌన్‌షి్‌ప వాసులు.. లడ్డూను కొనుగోలు చేశారు. శనివారం ఉదయం వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News