Hyderabad: అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారు..
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:28 AM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారు.. అంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్నారని చింతల విమర్శించారు.
- ఎమ్మెల్యే దానం అధికారం వైపే: చింతల
హైదరాబాద్: దానం ఎక్కడుంటే అక్కడే గెలుపు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Former MLA Chintala Ramachandra Reddy) వ్యంగ్యంగా స్పందించారు. దానం నాగేందర్ రాజకీయ టూరిజం ప్రజలందరికీ తెలుసునని, అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఎన్నిసార్లు ప్రజల మధ్యకు వచ్చాడని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్న దానం నైతికతపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమని చింతల పేర్కొన్నారు. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక ఖాయమని అందులో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. అభివృద్ధ్ది పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లలో గెలుపు దానం పగటి కలలకు ప్రజలే సమాఽధానం చెప్తారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News