Share News

Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 09:40 AM

ఈనెల 6వ తేదీ నిమజ్జనం సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.

Hyderabad:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..  విషయం ఏంటంటే..

  • 6న నిమజ్జనం సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. దారి మళ్లింపులు

హైదరాబాద్‌ సిటీ: ఈనెల 6వ తేదీ నిమజ్జనం సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) తెలిపారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ప్రధానంగా బాలాపూర్‌ నుంచి కట్టమైసమ్మ టెంపుల్‌, గుర్రం చెరువు, చార్మినార్‌, మదీన(Charminar, Medina), అఫ్జల్‌గంజ్‌, ఎస్‌ఏ బజార్‌, ఎంజే మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ మీదుగా ట్యాంక్‌ బండ్‌, సికింద్రాబాద్‌ నుంచి సంగీత్‌, ప్యాట్నీ, ప్యారడైజ్‌ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి.


city6.2.jpg

ఎర్రగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌ వైపునకు చేరుకుంటాయి. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువుకు ఇతర వాహనాలను అనుమతించరు. కూకట్‌పల్లి నుంచి మాదాపూర్‌ వైపు వచ్చే వాహనాలను జేఎన్‌టీయూ మీదుగా మాదాపూర్‌ వైపు మళ్లిస్తారు. హైటెక్‌ సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనాలను రెమిడీ ఆస్పత్రి వైపు పంపుతారు. ప్రగతి నగర్‌లో శ్రీనివాస స్టీల్స్‌ నుంచి మూడు కోతుల బొమ్మవరకు రోడ్డును మూసివేస్తారు. గండిమైసమ్మ నుంచి బాలానగర్‌ వైపుకు వెళ్లే వాహనాలను బహదూర్‌పల్లి జంక్షన్‌ వద్ద మళ్లిస్తారు. గచ్చిబౌలి నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్లే వాహనాలను ఎగ్జిట్‌ 17 నుంచి దారి మళ్లిస్తారు.


zzz.jfif

గణేశ్‌ నిమజ్జనానికి 600 ప్రత్యేక బస్సులు

గణేశ్‌ నిమజ్జనాల నేపథ్యంలో శనివారం నగరంలోని ముఖ్య ప్రాంతాల నుంచి ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌(Khairatabad, Lakdikapool), బషీర్‌బాగ్‌, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


నిమజ్జనాలు చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. గ్రేటర్‌లోని 31 ప్రాంతాల నుంచి స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు, రద్దీ ప్రాంతాల్లో సూపర్‌ వైజర్లను నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల వివరాల కోసం కోఠి బస్‌ స్టేషన్‌(9959226160) రేతి ఫైల్‌ బస్‌ స్టేషన్‌ (9959226154) నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 09:50 AM