Home » ABN Telugu Live
జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని.. ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నిక పదేండ్ల అభివృద్ధి పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక అని పేర్కొన్నారు.
బెంగళూరు జీకేవీకే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి కారు నడుపుతుండగా కారు సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. ఈ క్రమంలో కారు వెళ్తుండటంతో రోడ్డుపై ఉన్న ఇనుప కమ్మీ బాలుడు తలకు బలంగా తగిలింది.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు (Vemuri Radhakrishna) ఓ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణానికి చెందిన లీప్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రవి (Gundu Sivakumar Ravi) రాధాకృష్ణ చిత్రాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు నిరంతరం వార్తా సమాచారాన్ని అందించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి.. ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందిస్తోంది. @abntelugutv ఐడి ద్వారా ఎబిఎన్ వాస్తవ ట్విట్టర్ ఖాతా పనిచేస్తోంది. ఇది వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ కలిగి ఉంటుంది. కేవలం బ్లూటిక్ కలిగిన ఎబిఎన్ తెలుగు టీవీ ట్వి్ట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసే వార్తా సమాచారం మాత్రమే అధికారికమైనదిగా గమనించాలి. @ABNNewsLive పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు.
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...