Breaking News: కవిత ఎపిసోడ్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
ABN , First Publish Date - Sep 06 , 2025 | 09:11 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 06, 2025 20:50 IST
ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు మాజీ మంత్రి హరీష్‌రావు
మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన సిద్దిపేటలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఇవాళ(శనివారం) మాజీ మంత్రి హరీష్‌రావు రానున్నారు.
గత వారం రోజులుగా ఫాం హౌస్‌లోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.
హరీష్‌రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు నేతలు.
ఈ రోజు మధ్యాహ్నం ముగ్గురు నేతలు సమావేశమై, కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
-
Sep 06, 2025 20:30 IST
తణుకులో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రి భవనం పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.
సూర్యాలయం వీధిలోని లాస్య ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.
సుమారు 65 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
-
Sep 06, 2025 20:24 IST
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం.. భర్తను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపిన భార్య..
అమలాపురం రూరల్ మండలం నడిపూడి మెట్ల రాంజీ కాలనీలో ఘటన
భర్త దొమ్మేటి రాంబాబు(60) మృతి.
నిన్న(శుక్రవారం) రాత్రి నిద్రిస్తుండగా తలపై ఐరన్ రాడ్‌తో కొట్టి చంపిన భార్య వెంకటరమణ.
భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక చంపేశానని పోలీసు విచారణలో వెల్లడించిన భార్య..
మృతుడు కాకినాడ ఆర్టీసీ డిపో పరిధిలో స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపిన పోలీసులు.
గత కొన్ని రోజులుగా మృతుడు మద్యం తాగి రాత్రి వేళల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తెలిపిన భార్య.
ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అమలాపురం రూరల్ పోలీసులు..
-
Sep 06, 2025 20:11 IST
ములుగు జిల్లా మేడారం అడవుల్లో దారుణం
యువకుడిని సజీవ దహనం చేసిన దుండగులు.
మృతుడు భూపాలపల్లి వాసి బాసిత్‌గా గుర్తింపు.
మృతుడిని తాళ్లతో కట్టేసి బంధించి నిప్పు పెట్టిన దుండగులు.
భూపాలపల్లి స్టేషన్‌లో కేసు నమోదు.
మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించిన పోలీసులు.
-
Sep 06, 2025 19:30 IST
నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్

మా వ్యతిరేక పార్టీలు మా మీద ఎలాంటి కామెంట్లు చేశాయో... కవిత కూడా అలాంటి వ్యాఖ్యలు నా మీద చేశారు.
కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
రాష్ట్ర సాధనలో నా పాత్ర అందరికీ తెలుసు.
తెలంగాణ అభివృద్ధిలో ఓ కార్యకర్తలాగా పాతికేళ్లు పనిచేశాను.
ఎరువుల కొరత వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడుతోంది.
కేసీఆర్ దశాబ్ద కాలం కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది.
కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకునే విషయంలో.. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటంలో బాధ్యత కలిగిన వాళ్లం.
మా నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్న ప్రజలను రాష్ట్రాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.