ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jan 28 , 2026 | 07:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jan 28, 2026 22:00 IST
అమరావతి: మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్లకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం.
వారిని విధుల్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం.
సీఎం చంద్రబాబు అంగీకారంతో 730 మందికి దక్కనున్న ఉద్యోగాలు.
వైద్యారోగ్య శాఖ సమీక్షలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల పునర్ నియామక అంశంపై చర్చ.
సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు.
సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపీహెచ్ఏలను విధుల్లోకి తీసుకోవాలని సీఎం ఆదేశం.
-
Jan 28, 2026 21:09 IST
అమరావతి: సోషల్ మీడియాపై మంత్రి లోకేష్ నేతృత్వంలో సమావేశం
డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై 70% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి లోకేష్
పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేష్
డీ-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలి: మంత్రి లోకేష్
కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్ ఫ్రీ ఏపీ అమలుకు చర్యలు తీసుకోవాలి: లోకేష్
చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి: మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టేవారిపై కఠినచర్యలు: మంత్రి లోకేష్
-
Jan 28, 2026 20:53 IST
అమరావతి: సీఎం చంద్రబాబు రేపటి అరకు పర్యటన రద్దు
రేపు ఉదయం మహారాష్ట్ర బారామతి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.
బారామతి దగ్గర విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
-
Jan 28, 2026 20:05 IST
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ED చార్జ్‌షీట్
10 మందిపై ఈడీ అభియోగాలు.
నయీమ్‌కు చెందిన 91 ఆస్తులు గుర్తింపు.
నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించిన పాశం శీను.
-
Jan 28, 2026 18:58 IST
విశాఖ: భారత్ Vs న్యూజిలాండ్ నాలుగో టీ20
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.
5 టీ20ల సిరీస్‌ను 3-0తో ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్.
ఇషాన్ కిషన్ స్థానంలో అర్షదీప్ సింగ్.
మూడో టీ20లో గాయంతో ఇషాన్ కిషన్ దూరం.
-
Jan 28, 2026 18:25 IST
ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 14న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.
మార్చి 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం.
-
Jan 28, 2026 18:06 IST
సింగరేణిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
సింగరేణిలో ప్రభుత్వం ఎలాంటి నిబంధన పెట్టలేదు: శ్రీధర్‌బాబు
సైట్ విజిట్ ఎప్పటినుంచో ఉంది: మంత్రి శ్రీధర్‌బాబు
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయి: మంత్రి శ్రీధర్‌బాబు
నలుగురు మంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే తప్పా?: శ్రీధర్‌బాబు
-
Jan 28, 2026 17:54 IST
ఫిబ్రవరి 1రాత్రి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.
ఫిబ్రవరి 3నుంచి వరుసగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న సీఎం.
3న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం ప్రచార సభ.
ఫిబ్రవరి 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచార సభ.
ఇప్పటికే నిర్మల్, జడ్చర్ల, పాలేరులో సీఎం సభలు పూర్తి.
-
Jan 28, 2026 17:52 IST
ఢిల్లీ: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ.
-
Jan 28, 2026 17:50 IST
హైదరాబాద్: మియాపూర్ 100ఫీట్ రోడ్డులో ఘోర ప్రమాదం.
కారు, బైక్, స్కూల్ వ్యాన్ ఢీ.
వేగంగా బైక్‌ను ఢీకొని, అనంతరం స్కూల్ ఓమ్ని వ్యాన్‌ను ఢీకొట్టిన కారు.
ప్రమాదంలో స్కూల్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న విద్యార్థులకు తీవ్ర గాయాలు.
కారు డ్రైవర్‌తో పాటు ఓమ్ని వ్యాన్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గాయపడిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
రోడ్డు ప్రమాదం ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్.
-
Jan 28, 2026 17:46 IST
అనర్హత పిటిషన్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్..
పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు దానం నాగేందర్ వినతి.
నేను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదు: దానం నాగేందర్
నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదు: దానం
2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లా: దానం
నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోంది: ఎమ్మెల్యే దానం నాగేందర్
-
Jan 28, 2026 17:43 IST
జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్‌రెడ్డి
జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ రాజ్యం నడుస్తోంది: జీవన్‌రెడ్డి
జగిత్యాల మున్సిపాలిటీ అవినీతిమయమైంది: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకుంటున్నారు: జీవన్‌రెడ్డి
ఎమ్మెల్యే సంజయ్ వేధింపులతోనే.. గతంలో చైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా: జీవన్‌రెడ్డి
ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారారు: జీవన్‌రెడ్డి
సంజయ్ హయాంలో కమిషనర్ జైలుపాలయ్యారు: జీవన్‌రెడ్డి
-
Jan 28, 2026 17:35 IST
ICC టీ20 ర్యాంకుల టాప్-10లోకి సూర్యకుమార్ యాదవ్
5 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరిన సూర్యకుమార్.
అగ్రస్థానంలో కొనసాగుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ.
ICC టీ20 ర్యాంకుల మూడో స్థానంలో తిలక్ వర్మ.
బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో వరుణ్ చక్రవర్తి.
ICC టీ20 ర్యాంకుల మూడో స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా.
ఆల్‌రౌండర్ల విభాగం మూడో స్థానంలో హార్దిక్ పాండ్య.
11వ ర్యాంక్‌లో శివమ్ దూబె, అక్షర్ పటేల్‌కు 13వ ర్యాంక్.
-
Jan 28, 2026 17:01 IST
తల్లి పాలు కూడా కల్తీ చేయగల ఘనులు.. వైసీపీపై ఏపీ మంత్రి ఫైర్
తప్పులు చేసి ఎదుటి వారిమీదికి రుద్దటం వైసీపీ సహజ నైజం: మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి
పాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు: మంత్రి
కల్తీ నెయ్యి వాస్తవాలు అన్నీ త్వరలోనే బయటకు వస్తాయ్: మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి
-
Jan 28, 2026 16:56 IST
స్కూల్ బస్ బోల్తా.. విద్యార్థులకు గాయాలు
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మృగవాణి పార్క్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది
బండ్లగూడకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుగా గుర్తింపు
బస్సులో ఉన్న పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి
బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది
-
Jan 28, 2026 16:54 IST
చేర్యాలలో నామినేషన్ల స్వీకరణ మొదలు
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది
మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు గానూ ఆశావాహులు నామినేషన్లను దాఖలు చేయనున్నారు
నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు
నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
-
Jan 28, 2026 16:49 IST
అజిత్ పవార్ మరణం దేశానికి తీరని లోటు: బండారు దత్తాత్రేయ
అజిత్ పవార్ మృతి దేశ రాజకీయ వేదికపై తీవ్ర విషాదాన్ని నింపింది: బండారు దత్తాత్రేయ
ప్రజాసేవే జీవిత ధ్యేయంగా, అంకితభావంతో పనిచేసిన ప్రజానాయకుడు: మాజీ గవర్నర్
అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: బండారు దత్తాత్రేయ
-
Jan 28, 2026 16:42 IST
విద్యా ప్రతిష్ఠాన్ మైదానానికి అజిత్ పవార్ పార్థివదేహం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పార్థివదేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ మైదానానికి తరలిస్తున్న అధికారులు
ప్రజల సందర్శనార్థం అజిత్ పవార్ పార్థివదేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ మైదానానికి తరలింపు
అజిత్ పవార్ భౌతికకాయానికి నివాళులర్పించనున్న నేతలు
-
Jan 28, 2026 16:40 IST
విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలోని బారామతికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే చేరుకున్నారు.
విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని నేతలు పరిశీలించారు.
బారామతి చేరుకున్న ఎన్‌సిపి-ఎస్‌సిపి అధినేత శరద్ పవార్, ఆయన భార్య ప్రతిభా పవార్
రేపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగనున్నాయి
-
Jan 28, 2026 16:34 IST
మహారాష్ట్రలోని బారామతి చేరుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మహారాష్ట్రలోని బారామతికి చేరుకున్నారు
విమాన ప్రమాదంపై డీజీసీఏ, ఏఏఐబీలను అప్రమత్తం చేశాం: కేంద్రమంత్రి
అధికారులను కూడా సంఘటనా స్థలానికి రావాలని కోరాం: కేంద్రమంత్రి రామ్మోహన్
కాసేపట్లో విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
-
Jan 28, 2026 16:30 IST
కల్తీ నెయ్యిపై ఏపీ కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ
టీటీడీ నెయ్యి కల్తీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై స్పందించిన మంత్రులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది యదార్థం అని చెప్పిన అధికారులు
వైసీపీ వాళ్ళు తప్పులు చేసి మన మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన సీఎం చంద్రబాబు
-
Jan 28, 2026 16:24 IST
వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు క్లారిటీ
వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ చేసిన దుష్ప్రచారానికి సాక్ష్యాలతో సహా కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల
వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటికీ జరుగుతున్న పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి
పనులు పెండింగ్‌లో ఉన్నాయి.. కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోంది: మంత్రి నిమ్మల
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు జగన్ డ్రామాలాడారు: మంత్రి నిమ్మల
-
Jan 28, 2026 16:14 IST
వైసీపీ కుట్రలను ధీటుగా తిప్పికొడదాం: మంత్రి లోకేశ్
ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులతో నారా లోకేశ్ అల్పాహార విందు సమావేశం
మహాపాపం చేసి కూడా బుకాయించుకోవటం జగన్ కే చెల్లింది: లోకేశ్
పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక నివేదికను వక్రీకరిస్తున్నారు: మంత్రి
వైసీపీ నేతల భాగోతాన్ని ప్రజల్లో ఎండగడదాం: మంత్రి నారా లోకేశ్
-
Jan 28, 2026 16:09 IST
ఫిబ్రవరి 7 , 8 తేదీలలో కొండవీడు కోట ఉత్సవాలు
పల్నాడు జిల్లాలో కొండవీడు ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మాజీమంత్రి ప్రత్తిపాటి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష
కొండవీడు ఉత్సవాలు ఫిబ్రవరి 7, 8 న నిర్వహించబోతున్నాం: ప్రత్తిపాటి పుల్లారావు
రాష్ట్రమంత్రి కందుల దుర్గేశ్ చేతుల మీదుగా తొలిరోజు ఉత్సవాలు ప్రారంభించనున్నాం: మాజీ మంత్రి
5వ తేదీన చిలకలూరిపేటలో భారీస్థాయిలో కొండవీడు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం : ప్రత్తిపాటి పుల్లారావు
-
Jan 28, 2026 16:04 IST
హైదరాబాద్: కుల్సుంపురాలో అగ్నిప్రమాదం
వినాయకులు తయారీ షెడ్డులో చెలరేగిన మంటలు.
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.
-
Jan 28, 2026 15:07 IST
మహారాష్ట్రలో విమాన ప్రమాదంపై DGCA స్పందన
పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదు: DGCA
రన్‌వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారు: DGCA
తొలి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో కాసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది: DGCA
రెండోసారి ల్యాండ్ అయ్యేందుకు యత్నించి విఫలమయ్యారు: DGCA
-
Jan 28, 2026 14:44 IST
ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.
35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం.
PPP పద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్.
ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం.
TTD పరిధిలో పలు పోస్టుల అప్‌గ్రేడ్‌కు కేబినెట్ ఆమోదం.
పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కోసం భూకేటాయింపులకు ఆమోదం.
పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు కేబినెట్ ఆమోదం.
అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం.
డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం.
-
Jan 28, 2026 14:14 IST
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు
ఏపీకి చెందిన అనేక అంశాలపై వినతి పత్రం సమర్పించిన పవన్
పీఎం గతిశక్తి పథకం కింద పిఠాపురం రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: పవన్ కళ్యాణ్
పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
Jan 28, 2026 14:04 IST
తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ చామల కిరణ్ రెడ్డి
ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలి: ఎంపీ
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో న్యాయం చేస్తుందని ఆశిస్తున్న: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
-
Jan 28, 2026 13:56 IST
మూడు రోజుల సంతాప దినాలు
విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తును ప్రారంభించాయి
రాడార్, సీసీటీవీ, ఏటీసీ డేటా విశ్లేషణ జరుగుతోంది
డిప్యూటీ సీఎం మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే బారామతికి వెళ్లారు
-
Jan 28, 2026 13:47 IST
అజిత్ పవార్ విమాన ప్రమాద సీసీటీవీ ఫుటేజ్
సీసీటీవీ ఫుటేజ్‌లో మహారాష్ట్ర డిప్యూటీసీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు
సీసీటీవీ ఫుటేజ్‌లో విమానం రన్‌వే వైపు దిగుతుండగా నియంత్రణ తప్పి క్రాష్ అయిన క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విమానం గ్రౌండ్‌కు తాకగానే పెద్ద మంటలు, పొగ, ముక్కలైన శిథిలాలు
ఈ భయానక దృశ్యాలన్నీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి
-
Jan 28, 2026 13:42 IST
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై రంగంలోకి ఏఏఐబీ
విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించేందుకు ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ఢిల్లీ నుంచి బయలుదేరింది
ముందుగా పుణేకు, అక్కడి నుంచి బారామతికి ఏఏఐబీ బృందం ప్రయాణం
ప్రమాద స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్, అధికారులు
విమాన అవశేషాలు, సాంకేతిక లోపాలపై ఫోకస్
ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు చేయనున్న ఏఏఐబీ
-
Jan 28, 2026 13:36 IST
అర్జున అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు
ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతికి ప్రోత్సాహకాలు అందించడానికి ఏపీ కేబినెట్ ఆమోదం
కేబినేట్ నిర్ణయంపై ఏపీ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం
యర్రాజీ జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలం కేటాయింపుకు ప్రభుత్వం నిర్ణయం.
గ్రాడ్యుయేషన్ అనంతరం అర్హతల మేరకు గ్రూప్–I పోస్టులో నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
యువ క్రీడాకారుల భవిష్యత్‌కు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-
Jan 28, 2026 13:26 IST
అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు: కిషన్ రెడ్డి
వ్యవసాయ కుటుంబం నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు అజిత్ పవార్: కేంద్రమంత్రి
మహారాష్ట్రకు సుదీర్ఘకాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు: కేంద్రమంత్రి
-
Jan 28, 2026 13:20 IST
పవార్ లాంటి నాయకుడిని కోల్పోవడం తీరని లోటు: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
పవార్ లాంటి నాయకుడిని కోల్పోవడం తీరని లోటు: దేవేంద్ర ఫడ్నవీస్
వ్యక్తిగత జీవితంలో పవార్ నాకు మంచి స్నేహితుడు: మహారాష్ట్ర సీఎం
పవార్ కుటుంబానికి అండగా ఉంటాము: మహారాష్ట్ర సీఎం
మరికాసేపట్లో బారామతికి వెళ్ళనున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే
-
Jan 28, 2026 13:07 IST
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలిపిన ప్రత్యక్ష సాక్షి
విమానం కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిపిన ప్రత్యక్ష సాక్షి
విమానం నేలకు తాకే సమయంలో పేలడు శబ్ధాలు వినిపించినట్లు వెల్లడి
భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులు వచ్చినా ఎవరినీ రక్షించలేక పోయారని చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
Jan 28, 2026 11:49 IST
రికార్డులు సృష్టిస్తోన్న బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్ హైకి బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,65,170
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,400
కిలోపై రూ.13వేలు పెరిగి రూ.4,00,000కు చేరిన వెండి
-
Jan 28, 2026 11:39 IST
పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి: రాష్ట్రపతి
నేడు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది: రాష్ట్రపత్రి
స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందరికీ అందాలని అంబేడ్కర్ ఆకాక్షించారు: రాష్ట్రపత్రి
పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించాం: రాష్ట్రపత్రి
100 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు అందించాం: రాష్ట్రపత్రి
ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం: రాష్ట్రపతి
-
Jan 28, 2026 11:21 IST
అమరావతి: అజిత్ పవార్ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి.
-
Jan 28, 2026 11:19 IST
ఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి
అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం మహారాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం పని చేశారు: రాజ్‌నాథ్
అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
-
Jan 28, 2026 11:16 IST
మార్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
పొదిలి చిన్న బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యలమందయ్య(65) అనే వ్యక్తి మృతి
-
Jan 28, 2026 11:15 IST
ఎన్టీఆర్ జిల్లా: కొండపల్లిలో ఉరివేసుకుని చనిపోయిన యువకుడు
ఇటీవల మైనర్ బాలికను ప్రేమించి తన ఇంటికి తీసుకువెళ్లిన యువకుడు
మైనర్ కావడంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని తర్వాత పెళ్లి చేసేందుకు నిర్ణయం
మంగళవారం ఉదయం ఇంటిలో ఊరేసుకున్న యువకుడు
ప్రియుడు చనిపోయిన భయంతో నిన్న రాత్రి కొండపల్లి గజరాజుచెరువులో దూకిన బాలిక.. రక్షించిన స్థానికులు
రక్షణ కోసం ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాలిక కుటుంబ సభ్యులు
-
Jan 28, 2026 11:14 IST
ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మధ్యాహ్నం పార్లమెంట్‌లో 1:30 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ కానున్న ఏపీ డిప్యూటీ సీఎం
సాయంత్రం 5:00 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటి కానున్న పవన్ కళ్యాణ్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తోనూ భేటి కానున్న ఉప ముఖ్యమంత్రి
-
Jan 28, 2026 11:03 IST
స్టాక్ మార్కెట్ అప్డేట్స్: లాభాల్లో దేశీయ సూచీలు
లాాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలై ఆ తర్వాత భారీ లాభాల్లోకి ఎగబాకిన సెన్సెక్స్
ఉదయం 10:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 82,199 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్
104 పాయింట్ల లాభంతో 25,279 వద్ద కదలాడుతోన్న నిఫ్టీ
-
Jan 28, 2026 11:01 IST
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా
బారామతి విమాన ప్రమాదంపై వివరాలు తెలుసుకున్న మోదీ, అమిత్‌షా
-
Jan 28, 2026 10:31 IST
నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం
మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
వనదేవతలకు మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు
ఇవాళ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి రానున్న సారలమ్మ
రేపు గద్దెలపైకి రానున్న సమ్మక్క
సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం
మరుసటి రోజు 30న మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు
ఈనెల 31న వన వన ప్రవేశం చేయనున్న సమ్మక్క - సారలమ్మ
భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
జనాల గుడారాలతో రద్దీగా మారిన మేడారం
-
Jan 28, 2026 10:02 IST
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) దుర్మరణం
ప్రమాదంలో ఐదుగురి మృతి చెందినట్టు DGCA ప్రకటన
బారామతిలో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం
బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం
-
Jan 28, 2026 09:01 IST
హైదరాబాద్: మేడిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
మేడిపల్లి పీఎస్ పరిధిలో అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు
ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
మరో ముగ్గురికి గాయాలు.. పరిస్థితి విషమం
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jan 28, 2026 08:45 IST
అమరావతి: నేడు ఏపీ క్యాబినేట్ సమావేశం
సుమారు 35 అంశాలు ఎజెండాగా ఏపీ క్యాబినెట్ భేటీ
ఉదయం గం.10:30కు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశం కానున్న మంత్రిమండలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పలు సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
-
Jan 28, 2026 08:38 IST
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి.చెర్లోపల్లిలో విషాదం
సోలార్ ఫెన్సింగ్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ మృతి
మృతుడు ఉదయగిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కుర్ర మధుసూదన్‌గా గుర్తింపు
తన పొలంలో నువ్వు పంటకు నీళ్లు కట్టే సమయంలో సోలార్ కంచెపై పడటంతో ప్రమాదం
ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు
-
Jan 28, 2026 08:37 IST
నెల్లూరు జిల్లాలో వైన్ షాప్ వద్ద చెలరేగిన వివాదంలో వ్యక్తిపై దాడి.. మృతి
కొండాపురం మండలం వెలిగండ్లలో వ్యక్తి ప్రాణం తీసిన వైన్ షాప్ వద్ద వివాదం
రెండు రోజుల క్రితం తూర్పు యర్రబల్లి వైన్ షాప్ వద్ద ఇరువురి మధ్య చెలరేగిన వివాదం
కొండయ్య అనే వ్యక్తిపై కర్రతో దాడి.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jan 28, 2026 08:33 IST
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ వివరాలివే..
ఉదయం 10:15 గంటలకు సచివాలయానికి వెళ్తారు
10:30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు
మధ్యాహ్నం 03:00 గంటలకు గ్రీన్ కవర్‌పై సమీక్ష చేస్తారు
04.00 గంటలకు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు
సాయంత్రం 06:45 గంటలకు నివాసానికి చేరుకుంటారు
-
Jan 28, 2026 08:27 IST
బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం
ఏఎస్ఎల్ఐ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పర్సనల్ డేటాను దొంగిలించిన సీనియర్ ఉద్యోగి
రూ.87 కోట్ల విలువైన కంపెనీ సోర్స్ కోడ్‌ను తస్కరించిన అశుతోష్ నిగమ్
విధుల నుంచి తొలగించిన కంపెనీ యాజమాన్యం
ఐటీ యాక్ట్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jan 28, 2026 08:05 IST
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణికి సంబంధించిన కేటీకే-5 గనిలో అగ్నిప్రమాదం
కార్మికులకు సంబంధించిన ల్యాంప్ రూమ్‌లో చెలరేగిన మంటలు
సుమారు రూ.50లక్షల విలువైన 1500 ల్యాంపుల దగ్ధం
-
Jan 28, 2026 07:01 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి రేటు
హైదరాబాద్‌లో బుధవారం ఉదయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,940
రూ.1,48,440కి తగ్గిన 22 క్యారెట్ల పసిడి రేటు
కిలోకు వంద రూపాయలు పెరిగిన వెండి రేటు
హైదరాబాద్‌లో కిలోకు రూ.3,87,100కి చేరిన వెండి