Share News

టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:17 PM

ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది.

టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ
TTD ghee adulteration

అమరావతి: ఇవాళ(బుధవారం) సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో టీటీడీ నెయ్యి కల్తీ నివేదికపై చర్చ జరిగింది. నెయ్యి కల్తీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై కేబినెట్ మీటింగ్ లో మంత్రులు పలు విషయాలను సీఎంకు వివరించారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన బ్యాంకు అకౌంట్ లో రూ.4.50 కోట్లు జమ అయ్యాయని మంత్రులు అన్నారు. అధికారులు కూడా సీఎంకు పలు విషయాలను వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది యదార్థమని అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ తీసుకున్న డెయిరీకి పాల సేకరణ సామర్థ్యం లేదని అధికారులు వెల్లడించారు.


ఈ సమావేశంలో కల్తీ నెయ్యికి సంబంధించి మంత్రులు మరికొన్ని విషయాలను సీఎం వద్ద ప్రస్తావించారు. కాంట్రాక్ట్ తీసుకున్న డెయిరీలు కొన్ని రసాయనాలు మిశ్రమం ఉపయోగించి నెయ్యి తయారు చేశారని మంత్రులు వెల్లడించారు. వైసీపీ హయాంలో తప్పు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారని మంత్రులు అన్నారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత మాట్లాడుదామని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ నేరప్రవృత్తి అలానే ఉంటుందని, కోడి కత్తి, బాబాయి గొడ్డలి, గులక రాయి కేసులు ఎలా చేశారో మీరు చూశారు కదా? అని సీఎం అన్నారు.


ఇవి కూడా చదవండి...

నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

Updated Date - Jan 28 , 2026 | 04:25 PM