Home » Nara Chandra Babu Naidu
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో ఓ ముఖ్య కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమాావేశాాల్లో భాగంగా ఇప్పటికే పలు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా మరికొన్ని బిల్లులను ఈ రోజు మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిట్ట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఫ్యాన్ పార్టీ నేతలు పలుచన అవుతున్న క్రమంలోనే పలాయన వాదం అందుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గతంలో గొడవలు జరిగాయన్న విషయాన్ని ఇప్పుడు జగన్ అండ్ కో లేవనెత్తారు.
California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలియజేశారు.
రాజకీయాల్లో ‘విజనరీ’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు. పాలనలో టెక్నాలజీని వినియోగించడం, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆద్యుడు. 75 ఏళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు 47 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్(Jagan) బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేను ఆపేయడంతోపాటు అపుడు జరిగిన అవకతవకలును సరిదిద్దడానికి రెవెన్యూసదస్సులు నిర్వహిస్తోంది.
నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు.
బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.