Naravaripalli Celebrations: నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 15 , 2026 | 10:39 AM

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ(గురువారం) సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు గంగమ్మ ఆలయానికి వెళ్లనున్నారు.

చిత్తూరు జిల్లా, జనవరి 15: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ(గురువారం) సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు గంగమ్మ ఆలయానికి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. అలానే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి, వినతులు ఇవ్వడానికి పెద్దఎత్తున ప్రజలు నారావారిపల్లికు చేరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Updated at - Jan 15 , 2026 | 10:55 AM