CM Chandrababu: రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సీరియస్
ABN , Publish Date - Dec 18 , 2025 | 07:53 PM
గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూ వివాదాలు, 22A భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 22A భూముల వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే కలెక్టర్ల భేటీలో 22A భూముల వివాదాల పరిష్కారంపై తొలి ఎజెండాగా చేపడతామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 18: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూ వివాదాలు, 22A భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 22A భూముల వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే కలెక్టర్ల భేటీలో 22A భూముల వివాదాల పరిష్కారంపై తొలి ఎజెండాగా చేపడతామని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రెవెన్యూ శాఖ(revenue department)పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు ప్రొఫెషనల్స్ కావాలనే భూవివాదాలు సృష్టించే యత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై అవసరమైతే పీడీ యాక్ట్(PD Act warning) పెట్టి కఠినంగా వ్యవహరించండని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అలానే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నేరుగా ఓనర్లకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
హౌసింగ్‌లో పొజిషన్ సర్టిఫికెట్లు త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులకు తెలిపారు. 20-30 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు పొజిషన్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సీఎం తెలిపారు. విశాఖ, అనకాపల్లి సహా ఐదారు జిల్లాల్లో భూ కబ్జాలు నియంత్రించండని, భూకబ్జా ఫిర్యాదులపై తక్షణం కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోండని ఎస్పీలకు చంద్రబాబు(Chandrababu collector conference) ఆదేశించారు.
అలానే విశాఖలో భూ వివాదాల్లో నేతల జోక్యంపై డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించారు. భూ వివాదాల్లో కొందరు రాజకీయ నేతల జోక్యం ఉంటోందని, ఆ అంశంలో తనకు ఫిర్యాదులు అందాయని సీఎం దృష్టికి పవన్ కల్యాణ్ తెచ్చారు. డిప్యూటీ సీఎం తెలిపిన అంశంపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. భూ వివాదాల్లో రాజకీయ నేతల జోక్యాన్ని సహించొద్దని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. భూవివాదాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రాకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై సీఎం చంద్రబాబు రియాక్షన్