Kotam Reddy: అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:55 AM
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలిచేలా పనిచేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్‌కుమార్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే అభినందించారు.
నెల్లూరు, డిసెంబర్ 18: సంఖ్యా బలం ఉండటంతో మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) తెలిపారు. గురువారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రూప్‌కుమార్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి, కార్పొరేటర్లు, నేతలు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవిశ్వాసం పెట్టిన తర్వాత స్రవంతి రాజీనామా చేశారని.. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. కౌన్సిల్ మీటింగ్‌లో కూడా సభ్యులు ఆమె రాజీనామాను ఆమోదించారన్నారు.
కొత్త మేయర్ వచ్చే వరకు ఇన్‌ఛార్జి మేయర్‌గా రూప్ కుమార్ ఉంటారని... ఆయన కార్పొరేషన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలిచేలా పనిచేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చట్టప్రకారమే కొత్త మేయర్ ఎన్నిక: రూప్ కుమార్
అవిశ్వాసంతో తమకు సంబంధం లేదని వైసీపీ జిల్లా నేతలు చెబితే... ఓ కమెడియన్ వచ్చి హంగామా చేశారని ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అన్నారు. తోలుబొమ్మలాటలో కేటుగాళ్లులాగా వచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. కిక్ ఉండాలంటూ కొందరిని లాక్కునే ప్రయత్నం చేసి, నవ్వుల పాలయ్యారన్నారు. చట్టం గురించి అవగాహన లేని కొంత మంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త మేయర్ ఎన్నిక చట్ట ప్రకారం జరుగుతుందని తెలిపారు. కొత్త మేయర్ వచ్చే వరకు తాత్కాలిక మేయర్ ఉంటారని ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News