Share News

Srisailam Temple: భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:34 AM

శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను ఆన్‌లైన్‌లో పొంది వీలు కల్పించింది ప్రభుత్వం. ఈ సేవలను 9552300009 నెంబర్‌కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకోవచ్చిన ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.

Srisailam Temple: భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
Srisailam Temple

నంద్యాల, డిసెంబర్ 18: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయానికి (Srisailam Temple) భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. వీకెండ్‌, పండగల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, వివిధ రకాల సేవలను నిర్వహిస్తుంటారు భక్తులు. ఈ క్రమంలో మల్లన్న భక్తులకు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాస రావు గుడ్‌ న్యూస్ చెప్పారు. సాధారణంగా ఏ సేవకైనా ఆలయానికి వచ్చి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని ఈవో చెప్పుకొచ్చారు.


భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల 14 రకాల సేవలు అన్ని ఆన్‌లైన్‌లో పొందే వీలు కల్పించారు. భక్తుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా మెరుగైన సేవలు ప్రారంభించినట్లు ఈవో వెల్లడించారు. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను 9552300009 నెంబర్‌కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.


స్వామివారి శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం, స్పర్శ దర్శనం, వసతి సదుపాయాలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేవాదాయశాఖ అధికారిక వెబ్‌సైట్ www.aptemples.ap.gov. in,లేదా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.srisaila devasthanam.org ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ భూముల మాయం.. ప్రేక్షకపాత్రలో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది..!

SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 09:45 AM