Fake Currency Notes Scam: SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:03 AM
నకిలీ నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లాడు.
నకిలీ నోట్లతో బురిడీ
నిందితుడికి దేహశుద్ధి
లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నకిలీ నోట్లు (Fake Currency Notes) మార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో నగదు డ్రా చేసిన అనంతరం అక్కడే ఉన్న వాయల్పాడుకు చెందిన ఓ వ్యక్తికి నోట్లు లెక్కించమని రూ.50 వేల కట్ట ఇచ్చాడు.
ఇదే అదనుగా ఆ వ్యక్తి అసలు కట్టను తన జేబులో ఉంచుకుని తన వద్ద ఉన్న నకిలీ నోట్ల కట్టను బయటికి తీసి లెక్కించడం మొదలుపెట్టాడు. ఆ విషయం గుర్తించిన ఆదినారాయణ అవి నకిలీ నోట్లలాగా కనిపిస్తున్నాయంటూ గట్టిగా ప్రశ్నించాడు. ఈ విషయం గమనించిన బ్యాంకులోని ఖాతాదారులు నిందితుడితో పాటు, అతడికి తోడుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు దొరికారు. అతడికి దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ మస్తాన్ అక్కడికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
Read Latest AP News And Telugu News