Home » Kotamreddy Sridhar Reddy
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగర కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అనిల్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డిని కొట్టింది నిజమేనని తెలిపారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్ జీ యువతతో సమావేశాలు నిర్వహించడాన్ని, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
స్వామి వివేకానంద, శ్రీశ్రీ చెప్పినట్టు యువత పాత్రే దేశానికీ కీలకమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేడు యువత దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తోందని తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జీజీహెచ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి రూ.17కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
నేటి విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ అవకాశాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, సైన్యం, రాజకీయాల వంటి ప్రజాసేవా రంగాలపై ఆసక్తి కనపరిచేవారి సంఖ్య తగ్గిపోతోందని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నెల్లూరు రూరల్లో ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని.. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
నెల్లూరు రూరల్‌లో రూ.17 కోట్లతో చేపట్టే 168 అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్‌లో రూ.700 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.