Kotamreddy Sridhar Reddy: కుట్ర వెనకున్నది ఎవరు?
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:44 PM
ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై దాడి చేసేందుకు జరిగిన కుట్ర వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కుట్ర చేసిందెవరు? ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..
నెల్లూరు, ఆగస్టు 30: ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై దాడి చేసేందుకు జరిగిన కుట్ర వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కుట్ర చేసిందెవరు? ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కోటంరెడ్డి హత్య కుట్ర వీడియోపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలో ఉన్న వారిలో ఒకు ప్రస్తుతం జైలులో ఉండగా.. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకి కుట్రపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. వీడియోలో ఉన్నది రౌడీషీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీశ్, మహేశ్, వినీత్, జకీర్, రాజశేఖర్ రెడ్డిగా గుర్తించారు. వారంతా పాత నేరస్థులు అని నిర్ధారించారు. గతంలో పలు నేరాలకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జగదీశ్ ఇటీవల అరెస్ట్ అయ్యి, గంజాయి కేసులో రిమాండ్‌లో ఉన్నాడు. మిగిలిన నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న అంశం, కుట్ర వెనుక ఎవరున్నారనే వాటిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ వీడియో వైరల్ అవడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. హోంమంత్రి అనిత వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫోన్ చేశారు. ప్రభుత్వం మొత్తం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కోటంరెడ్డి అనుచరులు, టీడీపీ శ్రేణులు ఆయన కార్యాలయం వద్దకి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.