Share News

CM Chandrababu: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ పోస్ట్

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:22 PM

విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఏపీ సర్కార్ గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఓ ముఖ్య కార్యక్రమం జరిగింది.

CM Chandrababu: సోషల్ మీడియాలో  సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ పోస్ట్
CM Chandrababu Naidu

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓకే గూగుల్..సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్ అంటూ సీఎం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక్కడ 'Ok Google' అనేది గూగుల్ అసిస్టెంట్ ను ప్రారంభించే వాయిస్ యాక్టివేటెడ్ ట్రిగ్గర్. దీన్ని వాడి సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది. అలానే ‘గూగుల్ కమ్స్ టు ఏపీ’ (Google Data)హ్యాష్ ట్యాగ్‌తో చేసిన పోస్టులో ఆయన పలువురు ప్రముఖులకు ట్యాగ్ చేశారు.


విశాఖపట్నంలో(Visakhapatnam) 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌(Google Data Center) ఏర్పాటుపై ఏపీ సర్కార్ గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఓ ముఖ్య కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులతో పాటు గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలే, గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా ఫసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు కరణ్‌ బజ్వాలు పాల్గొన్నారు. విశాఖలో రూ.87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను( Viksit Bharat AP Project) గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్(AI Infrastructure AP) ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది.



ఇవి కూడా చదవండి:

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

Updated Date - Oct 14 , 2025 | 08:12 PM