Trump Invite Modi: కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:40 AM
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ ఒప్పందానికి రావాలంటూ ప్రధాని మోదీకి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సిసి సైతం ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ధృవీకరించలేదు. సోమవారం ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందానికి వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు.
దాదాపు రెండేళ్లుగా ఇజ్రాయెల్, తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం సంభవించింది. అయితే గాజాపై యుద్ధాన్ని ముగించేందుకు ఈ రెండు సుముఖత వ్యక్తం చేశాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఈ యుద్ధం ముగింపు కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ట్రంప్ తెరపైకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్విస్ట్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. ఏఐజీ వద్ద ఉద్రిక్తత
రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
For More National News And Telugu News