Constable Couple Attacks On Woman: రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:11 AM
రహదారిపై క్రికెట్ ఆడితే.. తన ఇంట్లోని పిల్లలకు బంతి తగులుతుందంటూ ఒక మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కానిస్టేబుల్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారు.
అనంతపురం, అక్టోబర్ 12: ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు.. ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు.. రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు.
ఆ క్రమంలో ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కల్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు.. తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు.. కల్యాణిపై దాడి చేశారు. దీంతో ఆమె అనంతపురం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హరిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హరిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తనపై మరోసారి దాడి చేశారంటూ కల్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
దాంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్.. నిందితులు అరెస్ట్
నేటి నుంచి వేములవాడ అలయంలో దర్శనాల నిలిపివేత..
For More AP News And Telugu News