Share News

Vemulawada Temple: నేటి నుంచి వేములవాడ అలయంలో‌ దర్శనాల నిలిపివేత..

ABN , Publish Date - Oct 12 , 2025 | 07:53 AM

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి‌ అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Vemulawada Temple: నేటి నుంచి వేములవాడ అలయంలో‌ దర్శనాల నిలిపివేత..

సిరిసిల్ల జిల్లా: తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ప్రసద్ధ పుణ్యక్షేత్రల్లో ఒకటి. ప్రధాన దైవం అయిన రాజరాజేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారని భక్తుల విశ్వషం. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలించి మొక్కులు తీర్చుకుంటూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా, నేటి(ఆదివారం) నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి అలయంలో‌ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి‌ అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులందరూ సహకరించాలని అధికారులు కోరారు. అయితే రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాల నిలిపివేత కొన్ని నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Updated Date - Oct 12 , 2025 | 08:00 AM