Share News

Liver Transplant Death: ట్విస్ట్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. ఏఐజీ వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:14 AM

వైద్యుల నిర్లక్ష్యంగానే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులతోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Liver Transplant Death: ట్విస్ట్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. ఏఐజీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్, అక్టోబర్ 12: వైద్యుల నిర్లక్ష్యంగానే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులతోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. దీంతో రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకుని.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన మురళీధర్ (40) లివర్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్‌దాన్‌లో లివర్ మార్పిడి కోసం నెలన్నర క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.


మురళీధర్ వయస్సు 40 ఏళ్లు అయితే.. 60 ఏళ్లుగా ఆసుపత్రి సిబ్బంది నమోదు చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లివర్ డోనర్స్ ఎవరూ ముందుకు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. దాంతో మురళీధర్ భార్య ముందుకు వచ్చి.. భర్తకు లివర్ ఇవ్వడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ కోసం నిన్న అంటే.. శనివారం రూ. 14 లక్షలను అతడి కుటుంబ సభ్యులు చెల్లించారు.


అనంతరం మురళీధర్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లాలంటూ అతడి కుటుంబ సభ్యులకు ఏఐజీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. నగదు చెల్లించిన తర్వాత ఈ ఈ విషయం వెల్లడించడంతో ఆసుపత్రి సిబ్బందిపై అతడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 45 రోజుల నుంచి ఇప్పటి వరకు ఆ ఆపరేషన్ నిమిత్తం రూ. 85 లక్షలు బిల్లు రూపంలో ఆసుపత్రికి చెల్లించామని వారు తెలిపారు.


ఈ ఆపరేషన్ కోసం ఉన్న ఒక ఇల్లు సైతం విక్రయించి.. నగదు చెల్లించినట్లు మృతుని బంధువులు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలంటూ.. ఈ సందర్బంగా మురళీధర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

ఎమ్మెల్యే కాలేజీలో భారీ చోరీ.. దర్యాప్తు ముమ్మరం

For More TG News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 11:25 AM