Hyderabad Robbery: ఎమ్మెల్యే కాలేజీలో భారీ చోరీ.. దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Oct 12 , 2025 | 08:35 AM
దుండగులను ప్రొఫెషనల్ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజ్ సిబ్బందిని సైతం విచారించినట్లు తెలిపారు. ఈనెల 10న గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో గుర్తుతెలియని వ్యక్తులు రూ.1.07 కోట్ల నగదును చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులకు చిక్కకుండా సీసీ కెమెరాలకు చెందిన డి.వి.ఆర్ సైతం దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 10న గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దుండగులను ప్రొఫెషనల్ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజ్ సిబ్బందిని సైతం విచారించినట్లు తెలిపారు. ఈనెల 10వ తేదీన బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, బ్రిలియంట్ ఇన్‌స్టిట్యూట్, బ్రిలియంట్ ఫార్మసీ, కసిరెడ్డి నారాయణరెడ్డికి సంబంధించిన కళాశాలలకు చెందిన రూ.1.07 కోట్ల నగదును సిబ్బంది కార్యాలయంలోని బీరువాలో ఉంచి తాళం వేసి వెళ్లినట్లు చెప్పారు. మరుసటి రోజు ఉదయం సిబ్బంది వచ్చేసరికి తలుపుల తాళం పగులగొట్టి ఉంది.. వెంటనే బీరువా దగ్గరకు వెళ్లి చూడగా.. దాచిన రూ.1.07 కోట్ల డబ్బు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు