ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:44 PM
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి, జనవరి 28: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం సందర్భంగా 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్‌గ్రేడ్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థలతో పాటు.. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కోసం భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించింది. డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. నెయ్యి కల్తీపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన విషయాన్ని అధికారులు కేబినెట్‌కు తెలిపారు.
ఇవి కూడా చదవండి
జగన్ హయాంలో భూములు దోచుకున్నారు.. మాధవీరెడ్డి ధ్వజం
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ శాంభవి పాఠక్ గురించి తెలుసా..