అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ శాంభవి పాఠక్ గురించి తెలుసా..
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:57 PM
పుణెలోని బారామతిలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు.
పుణెలోని బారామతిలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. పవార్‌తో పాటు, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, ఇద్దరు పైలట్లు.. సుమిత్ కపూర్, శాంభవి పాఠక్, ఒక ఫ్లైట్ అటెండెంట్ ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదానికి గురైన విమానం లియర్‌జెట్ నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ అయిన వీఎస్ఆర్ వెంచర్స్‌లో శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు (Ajit Pawar plane crash).
పాఠక్ ఎయిర్ ఫోర్స్ బాల భారతి స్కూల్‌లో 2016-18 మధ్య తన మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ శిక్షణ పొందారు. అలాగే ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఫ్రోజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అలాగే మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ లిమిటెడ్ నుంచి ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ రేటింగ్ దక్కించుకున్నారు (Shambhavi Pathak pilot death).
ప్రమాదానికి గురైన లియర్ జెట్-45లో గరిష్టంగా 9 మంది ప్రయాణించే వీలుంటుంది (India aviation accident). దీనిలో భద్రతా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. వాతావరణ సమస్యలతో పాటు పెద్ద సాంకేతిక లోపం తలెత్తితేనే క్రాష్ ల్యాండింగ్ చేస్తారు. అలా చేయడంతోనే ఈ రోజు ఉదయం విమానం రన్ వే పక్కకు వెళ్లి కూలిపోయినట్టు తెలుస్తోంది. బారామతిలో పొగమంచు విపరీతంగా ఉండడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో అమెరికా భయం.. ఒక డాలర్‌కు 15 లక్షల రియాల్స్..
స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..