Share News

జగన్ హయాంలో భూములు దోచుకున్నారు.. మాధవీరెడ్డి ధ్వజం

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:12 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ హయాంలో భూములు దోచుకున్నారు.. మాధవీరెడ్డి ధ్వజం
Madhavi Reddy

కడప, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి (Madhavi Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. భూమి రీసర్వే పేరుతో జగన్ రెడ్డి చేసిన దోపీడీలు, దుర్మార్గాలు, అక్రమాలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. బుధవారం కడపలో మాధవీరెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.


వేల ఎకరాలు దోచుకున్నారు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను జగన్ రెడ్డి వేల ఎకరాలు దోచుకున్నారని మాధవీరెడ్డి ఆరోపణలు చేశారు. భూ సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మ వేయడానికి రూ.650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకోవడానికి రూ.20 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజలకు మేలు చేశామని చెప్పుకొచ్చారు.


జగన్ అరాచకాలకు భయపడ్డారు..

జగన్ అరాచకాలకు భరించలేకనే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఎమ్మెల్యే మాధవీరెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. 5 లక్షల ఫిర్యాదులు స్వీకరించిందని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించిందన్నారు. కేవలం సంవత్సరం వ్యవధిలోనే ఎన్నో భూ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 02:40 PM