Share News

టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:42 PM

ఇవాళ ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటర్లు తమ ర్యాంకులను మెరుగు పర్చుకున్నారు. టీ20 టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ ఐదు స్థానాలు ఎగబాకి..టాప్-10లోకి దూసుకొచ్చాడు.

టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు
Suryakumar Yadav

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇవాళ(బుధవారం) టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. తాజాగా ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. ముఖ్యంగా బ్యాటర్లు భారీగా తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 12వ స్థానం నుంచి ఏకంగా 7వ స్థానంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం సూర్య 717 రేటింగ్‌ పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.


టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చాలా కాలం నుంచి అగ్రస్థానంలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ర్యాంకింగ్స్‌లో తన రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం 929 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్ల విషయానికి వస్తే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా 53, శివమ్‌ దూబే 59, రింకూ సింగ్‌ 68 స్థానాల్లో ఉన్నారు. గాయం​ కారణంగా న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్నా తిలక్‌ వర్మ తన మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.


ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేసులోనే కొనసాగుతున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13కు, రవి బిష్ణోయ్‌ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్దిక్‌ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరారు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 16, కుల్దీప్‌ యాదవ్‌ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే ఒకటి, 6 స్థానాలు మెరుగుపర్చుకొని 3, 12 స్థానాలకు ఎగబాకారు. సికందర్‌ రజా, సైమ్‌ అయూబ్‌ టాప్-2 ప్లేసుల్లో కొనసాగుతున్నారు.


ఇవి కూడా చదవండి:

'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్

Updated Date - Jan 28 , 2026 | 04:57 PM