'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
ABN , Publish Date - Jan 27 , 2026 | 07:09 PM
అతడు నిస్వార్థ పరుడు అంటూ టీమిండియా యువ హిట్టర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20లో అభిషేక్ శర్మ రోల్ మోడల్ అంటూ కొనియాడాడు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) చెలరేగి ఆడాడు. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ 28 బంతుల్లో 68 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 14 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ స్టార్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 'అతడు నిస్వార్థ పరుడు, పరిపూర్ణమైన ఆటగాడు' అంటూ అభిషేక్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) పొగడ్తల వర్షం కురిపించాడు.
అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ మంజ్రేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 'అతను అద్భుతమైన ఆటగాడు. అతడి టెక్నిక్‌ని చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అతడి టెస్ట్ క్రికెట్ టెక్నిక్‌ను టీ20 క్రికెట్(T20 Cricket) టెక్నిక్‌తో పోల్చినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ ఆదర్శమైన ఆటగాడు. ఈ యువ బ్యాటర్ నిస్వార్థంతో ఉండి జట్టు తరపున అద్భుతంగా ఆడుతున్నాడు. మనం గమనిస్తే.. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎప్పుడూ అతడి స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉంది' అని తెలిపాడు.
'అభిషేక్ శర్మ, తన వ్యక్తిగత స్కోర్ 90 పరుగుల వద్ద ఉన్నా సెంచరీ కోసం ఆలోచించడు. అంతేకాక సెంచరీ కోసం తన వేగాన్ని తగ్గించే వ్యక్తి కాదు. ఔట్ అయ్యే విషయం గురించి పట్టించుకోకుండా.. జట్టు విజయం కోసం మాత్రమే ఆలోచిస్తాడు. ఇది టీ20 క్రికెట్‌లో ఆడే ప్లేయర్ కు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఇలాంటి బ్యాటర్లు చాలా ప్రమాదకరమైనవారు. అతను ప్రతి బంతిపై ఎక్కువ పరుగులు రాబట్టే వ్యక్తి' అని మంజ్రేకర్(Sanjay Manjrekar) ఇన్ స్టాలో రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్
బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు