సూర్య సేనకు ఎదురుందా?
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:59 AM
హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే భారత జట్టు ఐదు టీ20ల సిరీ్‌సను ఖాతాలో వేసుకుంది. ఇక బుధవారం విశాఖ తీరాన జరిగే నాలుగో టీ20లోనూ అదే జోష్‌ను...
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
శాంసన్‌పై ఒత్తిడి
గెలుపే లక్ష్యంగా కివీస్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే భారత జట్టు ఐదు టీ20ల సిరీ్‌సను ఖాతాలో వేసుకుంది. ఇక బుధవారం విశాఖ తీరాన జరిగే నాలుగో టీ20లోనూ అదే జోష్‌ను ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ భీకరంగా సాగుతున్నా స్పిన్నర్ల నుంచి కూడా చక్కటి ప్రదర్శనను భారత జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అటు పర్యాటక న్యూజిలాండ్ పరిస్థితి దీనంగా కనిపిస్తోంది. ఎంత భారీ స్కోరు చేసినా కళ్లు చెదిరే హిట్టింగ్‌తో భారత బ్యాటర్లు ఉఫ్‌మని ఊది పారేస్తుండడంతో ఆ జట్టు అయోమయంలో పడుతోంది. ఎలాగైనా నేటి మ్యాచ్‌లో భారత్‌ను కట్టడి చేయడంతో పాటు ఓ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. బ్యాటింగ్‌లో ఫిలిప్స్, శాంట్నర్ మాత్రమే రాణిస్తున్నారు. ఇక పేసర్ జేమిసన్, డఫీ స్థానాల్లో ఫెర్గూసన్, నీషమ్ ఆడనున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దూబే, రింకూ, హర్షిత్ రాణా, కుల్దీ్‌ప/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, వరుణ్.
న్యూజిలాండ్: సీఫర్ట్, కాన్వే, రచిన్, ఫిలిప్స్, డారిల్ మిచెల్, చాప్‌మన్, నీషమ్, శాంట్నర్ (కెప్టెన్), హె న్రీ, ఫెర్గూసన్, సోధీ.

సంజూకిదే చివరి చాన్స్
భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్ సంజూ శాంసన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఇషాన్‌ను తీసుకుంటే సంజూకు బ్యాకప్ కీపర్‌గా భావించారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో శాంసన్ చేసింది 16 పరుగులే కాగా.. అటు ఇషాన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తూదుమ్మురేపుతున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ చివరి రెండు మ్యాచ్‌లకు కూడా దూరం కావడంతో శాంసన్‌కు మరో చాన్స్ దక్కడం ఖాయమే. ఇక టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో తన పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే ఈ చివరి రెండు మ్యాచ్‌ల్లో శాంసన్ నిరూపించుకోవాల్సిందే. ఇక అభిషేక్, సూర్య ఫామ్‌తో కివీస్ బౌలర్లు బంతులు వేసేందుకే భయపడుతున్నారు. కానీ స్పిన్నర్ కుల్దీప్ పరుగులు ఎక్కువగా ఇస్తుండడం ఆందోళనకరం. అటు మూడో టీ20లో ఆడిన రవి బిష్ణోయ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రొటేషన్‌లో భాగంగా అర్ష్‌దీప్, వరుణ్ జట్టులోకి రానున్నారు.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్