అజిత్ పవార్.. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:46 PM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కీర్తించారు.
ఢిల్లీ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంతో ఖ్యాతి గడించారని కీర్తించారు. అజిత్ పవార్ తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, రాజకీయాల్లో రాణిస్తూ.. డిప్యూటీ సీఎం స్థాయికి అజిత్ పవార్ ఎదిగారని కీర్తించారు. మహారాష్ట్రకు సుదీర్ఘకాలం డిప్యూటీ సీఎంగా పనిచేశారని కొనియాడారు. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంపై పట్టు సాధించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
అజిత్ పవార్ మృతిపై రామచందర్ రావు దిగ్భ్రాంతి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిసి చాలా బాధపడుతున్నానని అన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
Read Latest Telangana News And Telugu News