హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
ABN , Publish Date - Jan 28 , 2026 | 08:31 AM
హైదరాబాద్ నగర సమీపంలోని మేడిపల్లి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యారు. ఆ ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే.?
మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల కారు అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని, డ్రైవర్ స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిపారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వీరంతా ఒకే ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల చర్యలు..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా, లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.
పోలీసుల ముఖ్య సూచనలు..
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాహనదారులు, ముఖ్యంగా యువత సరైన జాగ్రత్తలు పాటించాలని మేడిపల్లి పోలీసులు సూచించారు. నగర శివార్లలో రోడ్లు ఖాళీగా ఉన్నాయని వేగం పెంచి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని.. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వాడవద్దని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News