విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:25 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో కనిపించాయి. ఆ భయానక క్షణాలు ప్రమాద సమయంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 28: మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన భయంకర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, NCP (అజిత్ పవార్ వర్గం) అధ్యక్షుడు అజిత్ అనంతరావు పవార్ (66) మృతి చెందారు. ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో ఉన్న మొత్తం 5 మంది (అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, సిబ్బంది, సెక్యూరిటీ పర్సనల్) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
అజిత్ పవార్ ముంబై నుండి బారామతికి వెళ్తున్న Learjet 45 (రిజిస్ట్రేషన్ VT-SSK) చార్టర్డ్ విమానం ఉదయం 8:10 గంటల సమయంలో టేకాఫ్ అయింది. ల్యాండింగ్ సమయంలో (సుమారు 8:40 గంటల సమయంలో) రన్‌వేకు 100 మీటర్ల దూరంలో విమానం నియంత్రణ తప్పి క్రాష్ అయింది. రెండవసారి ల్యాండింగ్ ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ఫ్లైట్ రాడార్ డేటా చూపిస్తోంది. క్రాష్ అయిన వెంటనే విమానం ముక్కలై, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు రక్షణ ప్రయత్నాలు చేసినా మంటల తీవ్రత వల్ల సాధ్యం కాలేదు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో కనిపించాయి. ఆ భయానక క్షణాలు ప్రమాద సమయంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
CCTV ఫుటేజ్‌లో విమానం రన్‌వే వైపు దిగుతుండగా నియంత్రణ తప్పి క్రాష్ అయిన క్షణాలు కనిపిస్తున్నాయి. విమానం గ్రౌండ్‌కు తాకగానే పెద్ద మంటలు, పొగ, ముక్కలైన శిథిలాలు కళ్లకు కడుతున్నాయి. ఈ భయానక దృశ్యాలన్నీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇవి దుర్ఘటన తీవ్రతను చూపిస్తున్నాయి.
దర్యాప్తు:
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విమాన ప్రమాదం మీద దర్యాప్తు ప్రారంభించాయి. రాడార్, CCTV, ATC డేటా విశ్లేషణ జరుగుతోంది.
సంతాప దినాలు
డిప్యూటీ సీఎం మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బారామతికి వెళ్లారు.