వెలిగొండ ప్రాజెక్ట్.. సాక్ష్యాలతో సహా వైసీపీకి మంత్రి నిమ్మల కౌంటర్
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:55 PM
వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకింత చేసినట్టు మాజీ సీఎం వైఎస్ జగన్ డ్రామాలాడారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు.
అమరావతి, జనవరి 28: వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి సాక్ష్యాలతో సహా కౌంటర్ ఇచ్చారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu). బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటికీ జరుగుతున్న పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెలిగొండ నిర్మాణం పూర్తి అయిపోయిందని.. జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎప్పుడో జాతికి అంకితం చేశారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఫొటోలు, వీడియోలతో నిమ్మల వెల్లడించారు.
ప్రాజెక్టు పూర్తి కాకుండానే పరదాల మాటున జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం చేసినట్టు డ్రామాలాడారని విమర్శలు గుప్పించారు. జాతికి అంకితం పేరుతో ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. క్రెడిబిలిటీ కోల్పోయిన జగన్ మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వెలిగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి నిమ్మల. టన్నెల్ ఏర్పాటు, హెడ్ రెగ్యులేటర్లు, ఫీడర్ కెనాల్ వంటి పనులు ఇంకా జరుగుతున్నాయని, ఇవన్నీ పూర్తి అయితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయినట్టు భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Read Latest AP News And Telugu News