Share News

'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:11 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఇరాన్‌తో చర్చలకు దిగే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ కూడా స్పందించారు.

'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'
Iran Vs US, Israel Tensions

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం.. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలకు దిగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు పలువురిని నిరాశ కలిగించగా.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిజంగా శాంతిని కోరుకుంటే పరస్పర చర్చలకు సిద్ధం కావాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయమై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ కోగంటి భాను ప్రకాశ్ 'ఎక్స్' వేదికగా తనదైన శైలిలో స్పందించారు.


ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేటితో 14వ రోజుకు చేరుకుంది. పశ్చిమాసియా దేశాల్లో పెరిగిన ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా చమురు విషయంలో ఆయా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు, చర్చలు మరింత కఠినంగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ నేతలు శాంతి కోసం కూర్చుని, ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్

Updated Date - Mar 13 , 2026 | 12:37 PM