-
-
Home » Devotional » khairatabad ganesh Shobha yatra 2025 indias biggest Ganpati nimajjanam VK
-
India’s Largest Ganpati Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర
ABN , First Publish Date - Sep 06 , 2025 | 11:32 AM
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Live News & Update
-
Sep 06, 2025 20:03 IST
సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి లో ఘనంగా గణనాథుల నిమజ్జనం
పాత బస్టాండ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు భారీగా ట్రాఫిక్ జామ్
దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
పోలీసులు, మున్సిపల్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి
ఆటోలో ప్రయాణం చేసి నిమజ్జనం తీరును పరిశీలించిన జగ్గారెడ్డి
-
Sep 06, 2025 19:45 IST
ఎన్టీఆర్: కంచికచర్ల మం. పరిటాల వినాయక వేడుకల్లో వివాదం
గణేష్ ఊరేగింపులో పాటలు పెట్టే విషయంలో ఇరువర్గాల ఘర్షణ
వినాయక విగ్రహం ఊరేగింపులో రాళ్లు విసిరిన ఓ వర్గం సభ్యులు
గాయపడిన ఇరువురిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
జాతీయరహదారిపై బైఠాయించి గణేష్ ఉత్సవ కమిటీ ఆందోళన
జాతీయరహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం, నిలిచిన రాకపోకలు
-
Sep 06, 2025 18:54 IST
ట్యాంక్ బండ్ వద్ద భక్తుల డ్యాన్సులు..
-
Sep 06, 2025 18:40 IST
హైదరాబాద్: బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి
హుస్సేన్‌సాగర్ అప్పర్ ట్యాంక్‌బండ్ 12వ క్రేన్ వద్ద గణేష్ నిమజ్జనం
-
Sep 06, 2025 18:31 IST
గుంటూరు: వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో 15 వేలమందికి అన్నదాన కార్యక్రమం, హాజరైన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్
-
Sep 06, 2025 16:50 IST
సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ విజువల్స్..
-
Sep 06, 2025 16:48 IST
తీన్మార్ కు సరదాగా స్టెప్పులేసిన పోలీసులు
-
Sep 06, 2025 16:31 IST
ప్రకాశం: వినాయక నిమజ్జనంలో అపశృతి
వినాయక నిమజ్జనం వేడుకలో ఇద్దరు మృతి
కొత్తపట్నం మం. గుండమాల సముద్రతీరంలో ఘటన
మృతులు మోటుమాలకు చెందిన నాగరాజు, పాలచందర్
-
Sep 06, 2025 16:17 IST
ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన సీఎం రేవంత్
ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా వచ్చిన సీఎం రేవంత్
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్
ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్
-
Sep 06, 2025 16:03 IST
నిమజ్జనోత్సవంలో హైడ్రా..


-
Sep 06, 2025 16:01 IST
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..
-
Sep 06, 2025 15:55 IST
మెజాంజాహీ మార్కెట్ చౌరాస్తాలో మొదలైన గణనాథుల సందడి
ఎంజే మార్కెట్ చౌరాస్తాకు చేరుకున్న బాలాపూర్ గణేశ్
భారీగా తరలివస్తోన్న భక్తులు
డప్పులు, నృత్యాలతో కోలాహలంగా హుస్సేన్ సాగర్ వైపు కదులుతోన్న గణనాథులు
భారీ బందోబస్త్ ఏర్పాటు పోలీసులు
-
Sep 06, 2025 15:34 IST
ముంబై, మహారాష్ట్ర: ఐకానిక్ లాల్‌బాగ్చా రాజ పండల్ నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న విజువల్స్
-
Sep 06, 2025 15:31 IST
ఖైరతాబాద్ వినాయకుడి విజువల్స్..
-
Sep 06, 2025 15:24 IST
ట్యాంక్ బండ్ వద్ద భక్తుల చిందులు..
-
Sep 06, 2025 15:19 IST
బడా వినాయకుడు.. సచివాలయం ఏరియల్ వ్యూ..
-
Sep 06, 2025 15:18 IST
నిజామాబాద్ జిల్లా:
బోధన్ పట్టణంలో ప్రారంభమైన గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర
సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రను ప్రారంభించిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, పట్టణ ప్రముఖులు
కనుల పండుగగా సాగుతున్న శోభయాత్ర
శోభాయాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
-
Sep 06, 2025 15:15 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల గణేశ్ నిమజ్జన శోభా యాత్రను ప్రారంభించారు.
-
Sep 06, 2025 15:06 IST
వినాయకులతో కిటకిటలాడుతున్న ట్యాంక్ బండ్..







-
Sep 06, 2025 14:48 IST
చార్మినార్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేశుడు
చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్‌కు బాలాపూర్ గణనాథుడు
చార్మినార్ వద్ద కోలాహల వాతావరణం
వినాయక శోభాయాత్రను చూడటానికి తరలి వస్తున్న భక్తజనం
-
Sep 06, 2025 14:46 IST
నారాయణపేట: వినాయక నిమజ్జనోత్సవంలో గుండెపోటుతో వ్యక్తి మృతి
-
Sep 06, 2025 14:45 IST
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది: డీజీపీ జితేందర్
సా.4 గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి: డీజీపీ
గణేష్ నిమజ్జనాలు రేపటివరకు కొనసాగుతాయి: డీజీపీ జితేందర్
గణేష్ నిమజ్జనం విధుల్లో అదనంగా ప్రత్యేక బలగాలు: డీజీపీ
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిమజ్జనాలు పర్యవేక్షణ: డీజీపీ
-
Sep 06, 2025 12:29 IST
కొనసాగుతోన్న బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర
చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా మీదుగా శోభాయాత్ర
-
Sep 06, 2025 12:28 IST
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి
గంగమ్మ ఒడికి తరలివస్తున్న బొజ్జ గణపయ్యలు
హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు
శోభాయాత్ర వాహనాలతో కిక్కిరిసిన నెక్లెస్‌రోడ్ పరిసరాలు
-
Sep 06, 2025 12:16 IST
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జనం ఊరేగింపు..

-
Sep 06, 2025 12:00 IST
పాతబస్తీలో మొదలుకాని వినాయక విగ్రహాల నిమజ్జనం సందడి
మండపాలకే పరిమితమైన గణనాథులు
మధ్యాహ్నం తర్వాత మండపాల నుండి ట్యాంక్‌బండ్‌కు తరలనున్న గణనాథులు
పాతబస్తీలో సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు
గణనాథులను సాధ్యమైనంత త్వరగా మండపాల నుండి తరలించేందుకు పోలీసుల చర్యలు
చార్మినార్ వద్ద పొలీస్ బందోబస్తు... బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
29 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు
సిటీ పోలీసులు 20 వేల మంది.. జిల్లాల నుండి 9 వేల మంది పోలీసులు..
డ్రోన్, హైరైజ్ కెమెరాలతో నిఘా.. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శోభాయాత్ర జరిగే తీరును పరిశీలించనున్న అధికారులు
-
Sep 06, 2025 11:37 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు
భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు.
ఐదు క్రేన్లు, రెండు లాంచీలు, 8 బోట్లు ఏర్పాటు.
నిమజ్జన విధుల్లో 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆదివారం చంద్రగ్రహణం ఉండటంతో నిమజ్జనానికి అధిక సంఖ్యలో గణేశ్ విగ్రహాలు వచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత.
-
Sep 06, 2025 11:34 IST
వరంగల్ జిల్లాలో గణనాథుల నిమజ్జనం
వరంగల్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం.
గణేష్ నిమజ్జనం కోసం పోచమ్మ మైదానం నుంచి చిన్న వడ్డేపల్లి చెరువు వరకు బారులు తీరిన విగ్రహాలు.