Lalbaugcha Raja: 13 గంటలు ఆలస్యంగా లాల్‌బాగ్చా రాజా వినాయక నిమజ్జనం
ABN , Publish Date - Sep 08 , 2025 | 09:37 PM
సంప్రదాయ ప్రకారం 18 అడుగులు ఎత్తైన లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఊరేగింపు అనంత చతుర్ధశి రోజున మొదలవుతుంది. మరుసటి ఉదయం 9 గంటల సమయంలో విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా అనుకున్న సమయానికే ప్లాన్ చేశారు.
ముంబై: ముంబైలోని ప్రఖ్యాత లాల్ బాగ్చా రాజా (Lalbaugcha Raja) గణపతి నిమజ్జనం ఆదివారం రాత్రి 10.30 గంటలకు గిరిగావ్ చౌపాటీ వద్ద జరిగింది. అయితే ప్రతిసారి ఆనవాయితీగా వస్తున్న నిమజ్జన సమయానికి సుమారు 13 గంటలు ఆలస్యంగా నిమజ్జనం చేశారు. దీనిపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, పున్నమి ఆటుపోట్లు కారణంగా ఆలస్యం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
సంప్రదాయ ప్రకారం 18 అడుగులు ఎత్తైన లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఊరేగింపు అనంత చతుర్ధశి రోజున ప్రారంభమవుతుంది. మరుసటి ఉదయం 9 గంటల సమయంలో విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా అనుకున్న సమయానికే ప్లాన్ చేశారు. అయితే అనుకున్న సమయానికి మాత్రం నిమజ్జనం చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. పున్నమి కావడంతో సముద్రంలో ఆటుపోట్లు ఉండటంతో ఆదివారం రాత్రి 10.30 నిమిషాలకు నిమజ్జనం చేశారు. అయితే ఆ సమయం సూతక ముహూర్తమని, అది శుభప్రదం కాదని కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ఈసారి మరో సంప్రదాయాన్ని కూడా నిర్వాహకులు పక్కనపెట్టేశారు. ప్రతిసారి మత్య్సకారుల ఫ్లోటింగ్ పడవలతో గణపతి నిమజ్జనం చేసేవారు. ఈసారి నిమజ్జనం కోసం హై-టెక్నలాజికల్ ఫ్లాట్‌ఫాం ఉపయోగించారు. ఈ ఫ్లాట్‌ఫాంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతోనూ నిమజ్జన కార్యక్రమంలో జాప్యానికి కారణమైంది. గిర్‌గావ్ చౌపాటీ వద్ద కొద్ది గంటల సేపు విగ్రహం నిలిచిపోయింది. దీనిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News