CM Revanth Reddy Appreciates Officials: తెలంగాణలో శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:16 AM
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు (Vinayaka immersion) ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరంలో లక్షలాది గణేశ్ విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు
ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్: మంత్రి తుమ్మల
For More TG News And Telugu News