Hyderabad Ganesh Nimajjanam: ఆదివారం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనాలు..
ABN , Publish Date - Sep 06 , 2025 | 09:05 PM
నగరంలో ఇంకా 4,700 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్: నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హుస్సెన్ సాగర్‌తో పాటు పలు చెరువుల వద్ద వినాయక నిమజ్జన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపుగా వచ్చే వివిధ రూపాల గణనాథులను చూడ్డానికి రెండుకళ్లు సరిపోవుడం లేదు. ఈ నేపథ్యంలో నగర సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు..
నగరంలో ఇంకా 4,700 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది టెక్నాలజీ ఆధారంగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్‌తో విగ్రహాల గుర్తింపు, వివరాల నమోదు చేసుకున్నట్లు గుర్తు చేశారు. 9 డ్రోన్ కెమెరాల ద్వారా గణేష్ నిమజ్జనాల పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరిగేలా తెలంగాణలోని పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు సీపీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్