Gadval MLA : BRS లోనే ఉన్నా.. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:06 PM
తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని బీఆర్ఎస్ గద్వాల్ MLA కృష్ణమోహన్‌రెడ్డి అంటున్నారు., తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని.. కేసీఆర్ ని గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినని..
హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు బీఆర్ఎస్ గద్వాల్ MLA కృష్ణమోహన్‌రెడ్డి. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. పార్టీ ఫిరాయింపు అంశానికి సంబంధించి స్సీకర్ నోటీస్‌కు సమాధానం ఇచ్చానని MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వివరాలు అందులో పొందుపరిచానని ఆయన తెలిపారు.
పార్టీ ఫిరాయించేరనే అంశానికి సంబంధించి ఆయన తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, మరో పార్టీ కండువా కప్పుకోలేదని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ను గౌరవించేవారిలో తాను మొదటి వ్యక్తినని, అభివృద్ధి లేకుండా ప్రజలను ఓట్లు అడగలేమని, పార్టీల కన్నా తనకు గద్వాల్ అభివృద్ధే ముఖ్యమని అందుకే తాను సీఎంను కలిశానని కృష్ణమోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కేవలం తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మాత్రమే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, పార్టీ మారేందుకు కాదని కొత్త వాణి వినిపించారు కృష్ణమోహన్ రెడ్డి.
కాగా, ఎమ్మెల్యే బండ్ల సీఎంను కలిసిన సందర్భాన ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారని బాగానే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆయన వ్యవహారం కూడా అందుకు బలాన్నిచ్చే విధంగానే సాగింది. అయితే, తాజాగా స్పీకర్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నోటీసులు ఇవ్వడంతో సీన్ రివర్స్ అయినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి
కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా