Parliament Live Today: 6వ రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్డేట్స్
ABN , First Publish Date - Dec 08 , 2025 | 11:01 AM
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. వందే మాతరం జాతీయ గేయం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు లోక్ సభ, రాజ్యసభలో దీని గురించి చర్చ జరుగుతోంది. సభల్లో జరిగే అంశాలన్నీ ఇక్కడ మీకోసం..
Live News & Update
-
Dec 08, 2025 16:17 IST
వందేమాతరం (Vande Mataram) గీతానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్ లాల్ నెహ్రూ 'అన్యాయం' చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడితే, మాజీ ప్రధాని నెహ్రూ వందేమాతర గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అన్నారని తెలిపారు.
-
Dec 08, 2025 15:25 IST
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరింత సమాచారం కోస ఈ లింక్ పై క్లిక్ చేయండి..
-
Dec 08, 2025 15:07 IST
వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం లోక్‌సభలో చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతరంపై లోక్‌సభలో మాట్లాడారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుందని, స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక అయిన వందేమాతర గీతం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి చూడండి.
-
Dec 08, 2025 14:24 IST
ఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు రూపకల్పనలో అందరితో చర్చించాం: రామ్మోహన్
నవంబర్ 1 నుంచి అమల్లోకి రెండో దశ నిబంధనలు: రామ్మోహన్ నాయుడు
డిసెంబర్ 3 నుంచే సమస్య... ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం
పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దు: రామ్మోహన్
టిక్కెట్టు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: రామ్మోహన్ నాయుడు
-
Dec 08, 2025 12:55 IST
దేశాన్ని ముక్కలు చేయాలని బ్రిటిషర్లు ప్రయత్నించారు: మోదీ
భారత్ ముక్కలు కాకుండా వందేమాతర నినాదం సాయం చేసింది
బెంగాల్ ఐక్యతకు వందేమాతరం గేయం పాత్ర ఎనలేనిది: మోదీ
వందేమాతర నినాదం పలకకూడదని నిషేధం విధించారు: మోదీ
నిషేధం, ఆజ్ఞలు పట్టించుకోకుండా ప్రజలు పోరాటం చేశారు: మోదీ
వందేమాతర నినాదాలు వినలేక బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడ్డారు
దేశంలో అనేక చోట్ల ఉద్యమకారులను కఠినంగా అణచివేశారు: మోదీ
-
Dec 08, 2025 12:48 IST
వందేమాతరం రాజకీయ స్వాతంత్ర్యానికి కేవలం మంత్రం కాదు: మోదీ
-
Dec 08, 2025 12:39 IST
బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరం దేశానికి పునరుజ్జీవాన్నిచ్చింది: మోదీ
గాడ్ సేవ్ ద క్వీన్ గీతానికి పోటీగా వందేమాతరం గర్వంగా నిలబడింది: మోదీ
వందేమాతరం.. ఆజాద్ భారత్‌కు విజన్‌గా మారింది
జననీ జన్మభూమిశ్చ అన్న రాముడి మాటలకు మరోరూపం వందేమాతరం: మోదీ
జ్ఞానం, సమృద్ధికి భారత్ మారుపేరు: ప్రధాని మోదీ
-
Dec 08, 2025 12:33 IST
వందేమాతరం అనేది ఒక మంత్రం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తి, ప్రేరణనిచ్చింది: ప్రధాని
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గళం వందేమాతరం
వందేమాతరం గేయానికి పునర్ వైభవం రావాలి: ప్రధాని
ఇవాళ్టి చర్చలు భవిష్యత్ తరానికి స్ఫూర్తి: ప్రధాని మోదీ
-
Dec 08, 2025 12:33 IST
వందేమాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉంది
2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరం: మోదీ
బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరం దేశానికి పునరుజ్జీవాన్నిచ్చింది: మోదీ
గాడ్ సేవ్ ద క్వీన్ గీతానికి పోటీగా వందేమాతరం గర్వంగా నిలబడింది: మోదీ
వందేమాతరం.. ఆజాద్ భారత్‌కు విజన్‌గా మారింది
-
Dec 08, 2025 12:23 IST
పార్లమెంట్ సమావేశాలు- LIVE VIDEO
-
Dec 08, 2025 12:21 IST
దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది: ప్రధాని మోదీ
వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉంది
100వ వార్షికోత్సవం సందర్భంగా దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది
-
Dec 08, 2025 12:19 IST
ఢిల్లీ: వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్‌సభలో చర్చ
వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నా: మోదీ
జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుంది: ప్రధాని మోదీ
వందేమాతరం.. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక
వందేమాతరం గేయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది: మోదీ
-
Dec 08, 2025 12:19 IST
స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం మంత్రం మొత్తం దేశానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది: లోక్‌సభలో ప్రధాని మోదీ
-
Dec 08, 2025 12:11 IST
'వందేమాతరం' 150 సంవత్సరాలపై చర్చకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ

-
Dec 08, 2025 11:59 IST
పార్లమెంట్ కు చేరుకున్న రాహుల్ గాంధీ
-
Dec 08, 2025 11:56 IST
ఈ గేయాన్ని కాంగ్రెస్ మార్చేసింది: వందేమాతరం చర్చపై బీజేపీ ఎంపి కంగనా రనౌత్
-
Dec 08, 2025 11:22 IST
ఏ పోరాటంలోనూ RSS భాగం కాదు: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఏ పోరాటంలోనూ RSS భాగం కాదు
అందుకే వారు మనకు స్వాతంత్ర్యం వచ్చే వరకు వందేమాతరం పాడలేదు
RSS అనుచరులు ముందుగా స్వాతంత్ర్య పోరాటం గురించి ఏమి మాట్లాడాలో చెప్పాలి
ఇప్పుడు ప్రధాని అన్ని రకాల నకిలీ కథనాలపై మాట్లాడటానికి ప్రయత్నిస్తారు
RSS, BJP లకు దేశాన్ని విభజించడం తప్ప వందేమాతరం గురించి మాట్లాడే హక్కు లేదు
-
Dec 08, 2025 11:19 IST
నాకు ఈ చర్చ నిజంగా నచ్చింది: సుధా మూర్తి
వందేమాతరం ఒక గొప్ప పాట
ఇది మన రాష్ట్రాలన్నింటినీ అనుసంధానించింది.. మొత్తం దేశం ఒక మేల్కొలుపును చవిచూసింది
ఇది కేవలం పాట కాదు, ఇది మన దేశాన్ని ఏకీకృతం చేసింది
-
Dec 08, 2025 11:10 IST
రాజ్యసభలో ఆప్ ఎంపీ రూల్ 267 నోటీసు
దేశరాజధాని ఢిల్లీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి, నేరాల పెరుగుదల ఆందోళనకరంగా ఉండటం, ఇళ్ల కూల్చివేతల వల్ల ఏర్పడిన మానవతా సంక్షోభంపై చర్చకు డిమాండ్ చేస్తూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో రూల్ 267 నోటీసు ఇచ్చారు
-
Dec 08, 2025 11:07 IST
పార్లమెంట్ లో ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్తున్న ఎన్డీయే ఎంపీలు
-
Dec 08, 2025 11:04 IST
ఎనిమిది మంది స్పీకర్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
వందేమాతరంపై ఈరోజు లోక్‌సభ చర్చకు ఎనిమిది మంది స్పీకర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
నాయకులలో ప్రియాంక గాంధీ వాద్రా, గౌరవ్ గొగోయ్, దీపేందర్ హుడా, డాక్టర్ బిమోల్ అకోయిజం, ప్రణితి షిండే, ప్రశాంత్ పడోలే, చామల కిరణ్ రెడ్డి, జ్యోత్సనా మహంత్ ఉన్నారు.
-
Dec 08, 2025 11:01 IST
లోక్‌సభలో మంగళ, బుధవారాల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చ
ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు సంబంధించి వివిధ అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావన
రాజ్యసభ బుధ, గురువారాల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చను నిర్వహిస్తుంది.