Ram Mohan Naidu: ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:43 PM
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఢిల్లీ: ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు (aviation minister statement).
ఇండిగో సంక్షోభం గురించి రాజ్యసభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని, నవంబర్ 1 నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి తెచ్చామని తెలిపారు. ఎఫ్డీటీఎల్ అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయని గుర్తు చేశారు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైందన్నారు (Ram Mohan Naidu comments).
వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు (IndiGo mismanagement). ఇండిగో సంక్షోభం కారణంగా 5,86,700 విమాన టికెట్లు రద్దు అయ్యాయని తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా తాము పరిమితులు విధించామని, టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో ఉంచితే ఈ వ్యాధులు నయం.!
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..