CM Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:46 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు.
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. చంద్రబాబు బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.
ఈ మేరకు సీఎం దావోస్ పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు అధికార వర్గాలు. ఇవాళ(సోమవారం)దావోస్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. అయితే దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కూడా సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమెరికాలోని డల్లాస్‌లో లోకేశ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో ప్రధాన అనుచరుడు
ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం
Read Latest AP News and National News