Home » Parliament
పార్లమెంటు ఆవరణలోకి కుక్కలు రాకూడదనే నిషేధం ఏదీ లేదని, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఒకసారి ఎద్దులబండిపై వచ్చారని రేణుకాచౌదరి గుర్తుచేశారు.
సంచర్ సాథీ యాప్‌తో వ్యక్తిగత జీవాతాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్‌ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు.
మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్డేట్స్
'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.
అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు.
కేవలం ఎస్ఐఆర్ పైనే కాకుండా ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్పై వెంటనే చర్చ జరగాలని ఉభయసభల్లోనూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ఫోన్లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
పెంపుడు జంతువులను పార్లమెంటుకు తీసుకురావడం ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్ అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమయ్యాక విపక్షాలు మరలా ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పునఃప్రారంభం కానుంది.
శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు.