Share News

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

ABN , Publish Date - Jan 29 , 2026 | 10:50 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..
2026 Budget India

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం అందరి దృష్టీ ఆదివారం, ఫిబ్రవరి 1 నాడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌ 2026పైనే ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఖర్చులు, పన్నులు, ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రణాళికలను వివరిస్తారు. అయితే బడ్జెట్‌కు ముందు, ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..


ప్రత్యక్ష పన్ను:

ప్రత్యక్ష పన్ను వ్యక్తులు లేదా సంస్థలపై నేరుగా విధిస్తారు. దాన్ని మరొక పార్టీకి బదిలీ చేయలేం. ఇందుకు ఉదాహరణ ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను.

పరోక్ష పన్ను:

పరోక్ష పన్నులను వస్తువులు, సేవలపై విధిస్తారు. అయితే వీటిని చివరికి వినియోగదారులే భరిస్తారు. ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం వీటికి ఉదాహరణ.

ఆర్థిక విధానం:

ఆర్థిక వృద్ధి, ఉపాధి, స్థిరత్వాన్ని నిర్వహించడం లక్ష్యంగా పన్నులు, ప్రజా వ్యవయంపై ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక విధానంలో ఉంటాయి.

ద్రవ్య విధానం :

ద్రవ్య విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, వడ్డీ రేట్లను నియంత్రించడంపై దృష్టి పెడుతుంది.

ఆర్థిక లోటు:

ప్రభుత్వం మొత్తం ఖర్చు, రుణాలు తీసుకోకుండా, దాని ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఆర్థిక లోటు ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వం అప్పులపై ఎంతవరకు ఆధారపడుతుందో సూచిస్తుంది.

రెవెన్యూ లోటు:

రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం, రెవెన్యూ రాబడుల మధ్య అంతరం. ఇది ప్రభుత్వ సాధారణ ఖర్చులు దాని సాధారణ ఆదాయాన్ని ఎంత మించి ఉన్నాయో తెలియజేస్తుంది.



ఇవి కూడా చదవండి

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..

Updated Date - Jan 29 , 2026 | 12:19 PM