Parliament Budget Session 2026: 28 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:50 PM
జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని వెల్లడించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల (Parlaiament Budgess Session-2026) తేదీలు ఫిక్స్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murumu) ఆమోదం తెలిపారు. ఆ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శుక్రవారం నాడు తెలియజేశారు. ఆ ప్రకారం జనవరి 28 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయి.
బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదట విడత ఫిబ్రవరి 13 వరకూ జరుగుతుంది. అనంతరం పార్లమెంటు వాయిదా పడుతుంది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభమైన ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయి.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజైన జనవరి 28న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. కాగా, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న రీత్యా 13వ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులను నిర్మలా సీతారామన్ నిర్వహించినట్టు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సంబంధిత శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు. ఆర్థిక విధానాల పటిష్టత, సమ్మిళత అభివృద్ధి, మహిళా సాధికారత, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్స్ తదతర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ
అమిత్ షా ఆఫీస్ ముందు ఆందోళన.. టీఎంసీ ఎంపీలు అరెస్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి