Sabarimala Gold Theft Cae: శబరిమల బంగారం చోరీ కేసు.. ప్రధాన పూజారి అరెస్టు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:22 PM
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజాగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
తిరువనంతపురం: సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ (Sabarimala Gold Theft Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరు (Kandararu Rajeevaru)ను ప్రత్యేక విచారణ బృందం (SIT) శుక్రవారంనాడు అరెస్టు చేసింది. సిట్ కార్యాలయంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి సుమారు రెండు గంటల సేపు ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అనంతరం అరెస్టు చేసినట్టు సిట్ అధికారికంగా ప్రకటించింది. ఆయనను కొల్లంలోని కోర్టుకు హాజరుపరుస్తున్నారు. రాజీవరుతో కలిపి ఈ కేసులో ఇంతవరకూ అరెస్టయిన వారి సంఖ్య 11కు చేరింది.
ఈ కేసులో ప్రదాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజా అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టుకు తీసుకువచ్చింది రాజీవరేనని ఈ కేసులో అరెస్టయిన దేవస్థానం బోర్టు మాజీ ప్రెసిడెంట్ ఎ.పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్టు సిట్ అధికారులు తెలిపారు. దీంతో సిట్ కార్యాలయానికి రాజీవరును రప్పించి విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఏమిటీ కేసు..
2019లో శబరిమల ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. అయితే ముందు ఉన్న దానితో బరువులో వ్యత్యాసం వచ్చినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలు తీవ్రం కావడంతో దర్యాప్తును సిట్‌కు కేరళ ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరుకు చెందిన ఉన్ని కృష్ణన్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు సిట్ చెబుతోంది. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ చేసుకోవడంతో కేసులో పలువురుని అదుపులోకి తీసుకోవడం జరగింది. ఈడీ సైతం మనీలాండరింగ్ కింద సీబీఐ అరెస్టు చేసిన నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రిమినల్ సిండికేట్‌లా వ్యవహరించిన లాలూ కుటుంబం.. ఐఆర్‌సీటీసీ స్కామ్‌పై ఢిల్లీ కోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి