Share News

అయోధ్య విరాళాల వివాదం.. సీఎం యోగికి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్!

ABN , Publish Date - Jun 21 , 2026 | 07:56 PM

అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయోధ్య విరాళాల వివాదం.. సీఎం యోగికి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్!
Ayodhya Ram Temple

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ అవకతవకలకు బాధ్యులైన పలువురిని సిట్ గుర్తించినట్టు సమాచారం. అయితే, దేవాలయ ట్రస్టులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారెవరూ సిట్ జాబితాలో లేరని తెలుస్తోంది.

దర్యాప్తులో భాగంగా సిట్ దాదాపు 150 మంది అనుమానితుల్ని ప్రశ్నించింది. ఆరు రోజుల పాటు దర్యాప్తు జరిపింది. ఈ క్రమంలో సిట్ దృష్టికి వచ్చిన ఆధారేమిటనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేవాలయ ట్రస్టుకు సంబంధించిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు యూపీ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శ్రీరామ జన్మభూమి మందిర్ ట్రస్టు ఆభ్యర్థన మేరకు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ ఎస్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక సెక్రటరీ నీల్ రతన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. తొలుత ప్రాథమిక నివేదిక సమర్పించి ఆ తరువాత వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.


దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రస్టు, దేవాలయం అధికారులు అయోధ్యను వీడవద్దని సిట్ అంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. విరాళాలకు సంబంధించిన రికార్డుల్లో తేడాలు కనిపించిన నేపథ్యంలో సిట్ ఈ చర్య తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విరాళాల నిర్వహణకు సంబంధించి కొందరు ట్రస్టు సిబ్బంది ఇచ్చిన సమాధానాలు సంతృప్తికంగా లేవని సిట్ అధికారులు భావించినట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

Updated Date - Jun 21 , 2026 | 08:12 PM