Home » Kiran Kumar Reddy
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపించారు.
మాజీమంత్రి కేటీఆర్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వదిలేశారా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు.
దేశంలో తెలంగాణను ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడున్న వ్యాపారస్తులను, పత్రికల యాజమాన్యాలను బీఆర్ఎస్ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఫార్ములా వన్ రేసు కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ అదృశ్యంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
మాజీమంత్రి కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లి దాక్కున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. వీళ్ల అవసరాల కోసం, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా చేస్తారని విమర్శించారు.