Share News

JP Nadda:కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు.. ఎందుకంటే..

ABN , Publish Date - Aug 19 , 2025 | 06:34 PM

కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

 JP Nadda:కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు.. ఎందుకంటే..
Congress MPs Meets JP Nadda

ఢిల్లీ, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను (JP Nadda) తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు (Telangana Congress MPs) ఇవాళ(మంగళవారం) ఢిల్లీలో కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. 14వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి పంపినట్లు జేపీ నడ్డా చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి 14వేలు మెట్రిక్ టన్నులు యూరియా వస్తుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.


వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

chamala-kirankumar-reddy.jpg

వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలు అంతా పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించామని అన్నారు. యూరియా కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిశారని వివరించారు. ఎంపీలం పలుమార్లు మంత్రి నడ్డాను కలిశామని గుర్తుచేశారు. తాము పలుమార్లు మంత్రిని కలవడంతోనే యూరియా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 19 , 2025 | 06:39 PM