Share News

Minister Uttam: హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:30 PM

హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Minister Uttam:  హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
Minister Uttam Kumar Reddy

హుజుర్‌నగర్, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సీరియస్‌గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో వెంకటయ్య అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

వాయుగుండం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన..

నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 19 , 2025 | 05:32 PM