ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
ABN , Publish Date - Jul 21 , 2026 | 10:29 AM
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్ అమలు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులకు కొత్త నిబంధనలకు ప్రతిపాదన చేసింది.
హైదరాబాద్, జులై 21 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్ అమలు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులకు కొత్త నిబంధనలకు ప్రతిపాదన చేసింది. ఈ రూల్స్‌పై సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. విధి నిర్వహణలో మొబైల్ క్యారీ చేయొద్దనే ప్రతిపాదనపై పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. డ్యూటీలో సెల్‌ఫోన్ వినియోగంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు.
ట్రాఫిక్ పోలీసులు మొబైల్ చూస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు దృష్టి సారించారు. ఇటీవల డ్యూటీలో సెల్‌ఫోన్ వినియోగాన్నిఅధికారులు గుర్తించారు. మొబైల్ మాట్లాడుతుండగా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది? అనే విషయంపై చర్చించారు. పోలీసులు అలర్ట్‌గా ఉంటే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై వీఎచ్ఎఫ్ సెట్ల ద్వారానే కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వీఎచ్ఎఫ్ సిగ్నలింగ్ సామర్థ్యాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి ట్రాఫిక్ సిబ్బందికి వీఎచ్ఎఫ్ సెట్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. కొత్త విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే త్వరలో నూతన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వీఎచ్ఎఫ్ సెట్లను ఉన్నతాధికారులు తప్పనిసరిగా చేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News