Home » Traffic Police
అహ్మదాబాలోని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడీ కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ.. చెంప చెల్లుమనిపించాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వాహనదారుడిపై దాడి చేశాడు. కారులో ఉన్న యువకుడిని పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతోంది.
హైదరాబాద్‌లో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. చలానా విధించారనే కోపంతో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అకస్మాత్తుగా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
వాహనదారులూ.. ఇక బి కేర్ ఫుల్. మీ బైక్, స్కూటర్, కారు మీద ట్రాఫిక్ చలాన్లు ఐదుకు మించి ఉంటే సొమ్ములు కట్టెయ్యాల్సిందే. లేదంటే మీ బండి సీజ్ చేస్తారు. లైసెన్స్ రద్దు..
దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. దీంతో రహదారులు కార్లు, బస్సులు, ఇతర వాహనాలతో రద్దీగా మారిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బతుకమ్మ కార్నివాల్ సందర్భంగా శనివారం అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
వాహనంలో ఐటీ కారిడార్‌కు వెళ్లాలంటేనే హడలిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ మార్గంలో వచ్చినా ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం ట్రాఫిక్ జామ్‌లు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారని, చలాన్లు విధించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.